స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున పరిశుద్ధమగు నీ
నామము గతకాలమున నీవు పతితుల మగు మాకు అతిదయతోఁ
జేసిన యన్ని మేలులు దలఁచి ||స్తుతి||
1. ఎన్న శక్యముగాక యున్న మహిమతో వెలుఁగు చున్న నీ పద సన్నిధిన్
సన్నుతాత్మా మేము ఆత్మతో సత్యముతో నిన్నారాధించుతము యీ
చెన్నౌ నీ గృహమందు ||స్తుతి||
2. ఇచట నీ వాక్యము నుచితరీతిని చాట నీ సేవకుల నందఱిన్
శుచియౌ నీ యాత్మతో పరిపూర్ణముగ నింపి ప్రచురింపను శక్తి నధిక
ముగ నిమ్ము ||స్తుతి||
3. భక్తితో నీ జనులు యుక్తముగ నిను వేఁడ శక్తి వారి కిమ్మెపుడు ముక్తి
కోసము నిన్నా సక్తితో ప్రార్థింప రక్తితో విని వారి కానందమును గూర్చు
||స్తుతి||
4. జనక కుమారాత్మ లను దేవ నీ కెప్పు డెనలేని స్తుతి కల్గును ఆనయము
మేమిలలో కొనియాడుటకు నిన్ను ఘనుఁడా దీవెన మాపై కుమ్మరింపుము
వేగ ||స్తుతి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతియింతుమో ప్రభువా శుభమౌ నీ దినమున Lyrics
Your favourites
- No Favourites found!
