Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ Telugu Christian Song Lyrics

స్తుతియింతుము స్తోత్రింతుము పావనుడగు మా పరమ Lyrics

స్తుతియింతుము - స్తోత్రింతుము
పావనుడగు మా - పరమ తండ్రి
1. నీ నామము ఋజువాయే - నీ ప్రజలలో దేవా
వర్ణింప మా తరమా - మహిమ గలిగిన నీ నామమును
2. మా ప్రభువా మా కొరకై - సిలువలో సమసితివి
మాదు రక్షణ కొరకై - రక్తమును కార్చిన రక్షకుడా
3. మా ప్రభువైన యేసుని - పరిశుద్ధాత్మ ప్రియుని
ప్రియమగు కాపరులన్ - ప్రియమారా మా కొసగిన తండ్రి
4. పరిశుద్ధ జనముగా - నిర్దోష ప్రజలుగా
పరలోక తనయులుగా - పరమ కృపతో మార్చిన దేవా
5. సంపూర్ణ జ్ఞానమును - పూర్ణ వివేచనమును
పరిపూర్ణంబుగ సలుగ - పరిపూర్ణ కృపనిచ్చిన తండ్రి
6. ప్రభు యేసు క్రీస్తులో - పరలోక విషయములో
ప్రతియాశీర్వాదములన్ - ప్రాపుగ నొసగిన పరమ తండ్రి
7. ఎల్లరిలో జీవజలం - కొల్లగ పారునట్లు
జీవంబు నిచ్చితివి - జీవాధిపతి హల్లెలూయ


Your favourites

  • No Favourites found!