స్తుతియింతుము యేసు ప్రభువా (2) - మా స్తుతికి పాత్రుడా (2)
నిత్యం నిన్నే ఆరాధించి (2) - మహిమ పరతుము ఇలలో (2)
స్తుతికి పాత్రుడా (2)
1. మా పాపములు మమ్ము నీకు - బహుదూరంబు జేయగా
ఏ పాపమెరుగని ప్రభువా - మాకై సిలువలో బలియైతివా
నీ రక్తముతో మమ్ము కడిగి - నీ చెంతకు చేర్చితివా
2. లోకాశకు లొంగిపోయి - నీ సహవాసమును వీడగ
ఆకాశమును వీడి మాకై - నీతో సహవాస మొసగితివా
పరిశుద్ధులుగా మమ్ము తీర్చి - పరమ స్వాస్థ్యము నిచ్చితివా
3. సాతానుకు దాసులమై - నిత్య మార్గమును వీడగ
పతనమైన మా బ్రతుకుల్ - నిత్య జీవముగా మార్చితివా
నిత్యము నిన్నే సేవింప - సత్యవాక్యము నొసగితివా
4. నిరీక్షణ లేక మేము - నిర్భాగ్యులమై యుండగా
త్వరగా రానై యున్న ప్రభువా - పరమ నిరీక్షణ నిచ్చితివా
నీ రాకకై ఎదురు చూడ - సిద్ధపాటును నొసగితివా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
స్తుతియింతుము యేసు ప్రభువా మా స్తుతికి Lyrics
Your favourites
- No Favourites found!
