Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల Telugu Christian Song Lyrics

స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల Lyrics


స్తుతియు మహిమ ఘనత నీకే
యుగయుగముల వరకు
ఎంతో నమ్మదగిన దేవా (2)       ||స్తుతియు||

మా దేవుడవై మాకిచ్చితివి
ఎంతో గొప్ప శుభ దినము (2)
మేమందరము ఉత్సాహించి సంతోషించెదము (2)
కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని (2)       ||స్తుతియు||

నీవొక్కడవే గొప్ప దేవుడవు
ఘనకార్యములు చేయుదువు (2)
నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా (2)
నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము (2)           ||స్తుతియు||

నీవే మాకు పరమ ప్రభుడవై
నీ చిత్తము నెరవేర్చితివి (2)
జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా (2)
నడిపించెదవు సమ భూమిగల ప్రదేశములో నన్ను (2)   ||స్తుతియు||

భరియించితివి శ్రమలు నిందలు
ఓర్చితివన్ని మా కొరకు (2)
మరణము గెల్చి ఓడించితివి సాతాను బలమున్ (2)
పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము (2)    ||స్తుతియు||

Your favourites

  • No Favourites found!