Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ Telugu Christian Song Lyrics

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ Lyrics

స్తుతియు మహిమయు నీకె క్షితికిన్ దివికిన్ నీటి వితతికిన్ కర్తవై వెలయు
మా దేవా ప్రతి వస్తువును మాకు బహుమతిగా నిచ్చు హితుఁడా మా ప్రేమ
నీ కెట్లు చూపుదుము ||స్తుతియు||

1. పసిఁడి వర్ణపు టెండ భాగ్య ధారల వాన విసరు మంచి గాలి
విరియు పుష్పములు రస మొల్కు పండ్లు నీ రమ్య ప్రేమన్ జాటున్
బ్రసరించు కో తలో పల నుందు వీవు ||స్తుతియు||

2. నెమ్మదిగల యిండ్లు నిజసౌఖ్య కాలములు ఇమ్మహి ఫలియించు
నైశ్వర్యాధికముల్ ఇమ్ముగ గలిగిన హృదయులమై వంద నమ్ములు
ఋణపడి యు న్నాము నీకు ||స్తుతియు||

3. దురితంబు లొనరించి దౌర్భాగ్య స్థితి నున్న ధరణికి నీ పుత్రున్
ధర్మంబు జేసి నరుల కీ ధర్మమున కొరఁత దీర్చెడు సర్వ వరము
లమర్చిన పరమోపకారి ||స్తుతియు||

4. జీవంబు ప్రేమను జేవఁ గల్గించెడు పావనాత్మను మాకై పంపితివి
దీవెన లేడు రె ట్లావరింపను మమ్ము నీ విమలాత్మ వా నిని గుమ్మ
రించు ||స్తుతియు||

5. నరులకు విమోచ నము గల్గె పాపంబుల్ పరిహార మాయెఁ గృ
పాసాధనముల్ దొరికె మోక్షాంశంబు స్ధిరమాయె మేము నీ కొరకేమి
తేగలము పరిపూర్ణ జనకా ||స్తుతియు||

6. మాకై వాడుకొనెడి రూకల్ వ్యర్థం బగును నీకై యప్పుగ నిచ్చు నిఖిల
వస్తువులు శ్రీకరంబగు నిత్య శ్రేష్ఠ ధననిధియై పై లోకంబు నందుండు
లోపంబు లేక ||స్తుతియు||

7. జీవంబు వస్తువులు శ్రేయస్సు దాన స్వ భావంబు శక్తియు భాగ్యంబులు
నీవలననే లభ్యమై వెలయుచున్నవి నీ వాసమే మాకు నిత్యానందంబు
||స్తుతియు||

Your favourites

  • No Favourites found!