Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు Telugu Christian Song Lyrics

స్తుతులకు పాత్రుండవు సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు Lyrics

స్తుతులకు పాత్రుండవు
సృష్టించినావు రక్షించినావు భద్రపరచుచున్నావు
1. జీవపు రొట్టె వైతివి నీవే - తృప్తిపరచిన ప్రియుడవు నీవే
గొప్ప కార్యము చేయ - మా సామర్ధ్యము నీవే
2. లోకమునకు వెలుగు నీవేగా - మా నేత్రముల తెరచితివిగా
అద్భుతము చేసితివి - మా ప్రకాశము నీవే
3. ఏకైక ద్వారం మాకిల నీవే - ప్రవేశమిచ్చి రక్షించినావు
పూర్ణ క్రియ చేసితివి - సంపూర్ణ శాంతి నీవే
4. మంచికాపరి మాకై నీవిల - ప్రాణంబు నిచ్చి రక్షించితివి
విడుదల చేసితివి - గొర్రెల నడిపెదవు
5. పునరుత్థాన జీవంబు నీవే మరణము నుండి దాటించితివి
విజయంబు నిచ్చితివి - నూతన పరచితివి
6. మార్గ సత్యము మాకిల నీవే - దుర్బోధ నుండి కాపాడినావు
చేసితివి ఆత్మకార్యం - ఉన్నత స్థలమందుంచి
7. నిజమైన ద్రాక్షవల్లివి నీవే - నీ యందు నిలిచే తీగెలు మేము
లోతైన క్రియ చేసి - ఆత్మ ఫలమిచ్చితివి


Your favourites

  • No Favourites found!