సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు మృదువుగాను
జీ వించు వాని పెద్ద నిదుర బోయినటు లెదలందు భావించి
||సుదతులార||
1. ఇచట లేఁడు లేచి యున్నాఁడు ప్రభు క్రీస్తు యేసు స్వతంత్రుఁడై
ప్రచురంబుగఁ దన పాట్లు లేచుటయును వచియించె గలిలయ్య వర
దేశమున మీతో ||సుదతులార||
2. మనుజ కుమారుఁ డె క్కుడు పాపిష్ఠులచేత మరణ మొందుట సిల్వ
పైఁ దనకుఁ దానె మూఁడవ దినమందు లేచుట యును దెల్పెఁ గద
మీరు వినుచుండఁగఁ దొల్లి ||సుదతులార||
3. ఎదలలోన జ్ఞాప కము చేసికొనుఁడింక యేసు తెల్పిన మాటలు
ముదముతో జీవముఁ గని లేచె నను వార్త సుదతు లాలకించి రది
నిక్కముగఁ దోఁచఁ ||సుదతులార||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సుదతులార మీ రిచ్చోట నెవ్వరి వెదుకుచునున్నారు Lyrics
Your favourites
- No Favourites found!
