Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని Telugu Christian Song Lyrics

సుధా మధుర కిరణాల అరుణోదయం కరుణామయుని Lyrics


సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2)            ||సుధా||

దివి రాజుగా భువికి దిగినాడని – రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని – పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా – నిరుపేదగా – జన్మించగా – ఇల పండుగ (2)           ||సుధా||

లోకాలలో పాప శోకాలలో – ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా – ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే – ఒక మర్మము – ఆ బంధమే – అనుబంధము (2)          ||సుధా||

Your favourites

  • No Favourites found!