సుధా మధుర కిరణాల అరుణోదయం
కరుణామయుని శరణం అరుణోదయం (2)
తెర మరుగు హృదయాలు వెలుగైనవి
మరణాల చెరసాల మరుగైనది (2) // సుధా //
1. దివి రాజుగా భువికి దిగినాడని
రవి రాజుగా ఇలను మిగిలాడని (2)
నవలోక గగనాలు పిలిచాడని
పరలోక భవనాలు తెరిచాడని (2)
ఆరని జీవన జ్యోతిగ వెలిగే తారొకటొచ్చింది
పాడే పాటల పశువులశాలను ఊయల చేసింది (2)
నిను పావగా – నిరుపేదగా
జన్మించగా – ఇల పండుగ (2) // సుధా //
2. లోకాలలో పాప శోకాలలో
ఏకాకిలా బ్రతుకు అవివేకులు (2)
క్షమ హృదయ సహనాలు సమపాలుగా
ప్రేమానురాగాలు స్థిర ఆస్తిగా (2)
నమ్మిన వారిని రమ్మని పిలిచే రక్షకుడా యేసే
నిత్య సుఖాల జీవజలాల పెన్నిధి ఆ ప్రభువే (2)
ఆ జన్మమే – ఒక మర్మము
ఆ బంధమే – అనుబంధము (2) // సుధా //
