Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల Telugu Christian Song Lyrics

సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల Lyrics


సుగుణాల సంపన్నుడా – స్తుతి గానాల వారసుడా
జీవింతును నిత్యము నీ నీడలో
ఆస్వాదింతును నీ మాటల మకరందము

యేసయ్య నీతో జీవించగానే
నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే
నాట్యమాడేను నా అంతరంగము
ఇది రక్షణానంద భాగ్యమే            ||సుగుణాల||

యేసయ్య నిన్ను వెన్నంటగానే
ఆజ్ఞల మార్గము కనిపించెనే
నీవు నన్ను నడిపించాగలవు
నేను నడవవలసిన త్రోవలో         ||సుగుణాల||

యేసయ్య నీ కృప తలంచగానే
నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే
నీవు నాకిచ్చే మహిమ ఎదుట
ఇవి ఎన్నతగినవి కావే               ||సుగుణాల||

Your favourites

  • No Favourites found!