Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి Telugu Christian Song Lyrics

సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి Lyrics

సుఖులారా సంఘంపు బడి సంభంబునకు నారుమడి సుఖజీవమిట
గన్గొనుడి చోద్యంపు కధలను వినుడి ||సఖులారా||

1. విద్యార్థులకు బోధంబు వినుడొజ్జలకు మోదంబు పద్యాలు కీర్తనంబు
ల్బడయంగ నిదితరుణంబు ||సఖులారా||

2. మేలౌ గుటుంబములకు మితిలేని సంఘములకు జాల ప్రదేశంబులకు
సన్మార్గమొదపు నెలవు ||సఖులారా||

3. పసిబిడ్డలను రావించి పరిష్వంగమును గావించి వెసఁబ్రేమతో దీవించి
విభుడంపె నిది భావించి ||సఖులారా||

4. ఆబాలగోపాలముగ నా చంద్ర తారకముగ బైబిలును యుక్తముగఁ
బఠియింప దగుఁచిత్రముగ ||సఖులారా||

5. మన జిహ్వలకు మధురంబు మన యంఘ్రలకు దీపంబు మన చేతులకు
ఖడ్గంబు ఘనపావన వేదంబు ||సఖులారా||

6. శుభవర్తమానంబు విని సొంపొంద రక్షణ గని ప్రభు సంఘమున
జేరుకొని పరులన్ రక్షించుడి చని ||సఖులారా||

7. ధరణిలో బడులూరూర స్థాపింపబడి పెంపార బరమాత్ముని మన సారఁ
బ్రార్థింతము హితులారా ||సఖులారా||

Your favourites

  • No Favourites found!