Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సుమధుర స్వరముల గానాలతో  వేలాది Telugu Christian Song Lyrics

సుమధుర స్వరముల గానాలతో వేలాది Lyrics

సుమధుర స్వరముల గానాలతో – వేలాది దూతల గళములతో
కొనియాడబడుచున్న నా యేసయ్యా – నీకే నా ఆరాధన (2)
మహదానందమే నాలో పరవశమే
నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
ఎడారి త్రోవలో నే నడిచినా – ఎరుగని మార్గములో నను నడిపినా
నా ముందు నడచిన జయవీరుడా – నా విజయ సంకేతమా (2)
నీవే నీవే – నా ఆనందము
నీవే నీవే – నా ఆధారము (2) ||సుమధుర||
సంపూర్ణమైన నీ చిత్తమే – అనుకూలమైన సంకల్పమే
జరిగించుచున్నావు నను విడువక – నా ధైర్యము నీవేగా (2)
నీవే నీవే – నా జయగీతము
నీవే నీవే – నా స్తుతిగీతము (2) ||సుమధుర||
వేలాది నదులన్ని నీ మహిమను – తరంగపు పొంగులు నీ బలమును
పర్వత శ్రేణులు నీ కీర్తినే – ప్రకటించుచున్నవేగా (2)
నీవే నీవే – నా అతిశయము
నీకే నీకే – నా ఆరాధన (2) ||సుమధుర||

Your favourites

  • No Favourites found!