Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సుందరములు అతి సుందరములు సువార్త మోసిన Telugu Christian Song Lyrics

సుందరములు అతి సుందరములు సువార్త మోసిన Lyrics


సుందరములు అతి సుందరములు
సువార్త మోసిన పాదములు
అతి శ్రేష్ఠులు ఎంతటి ధన్యులు
ప్రభు ప్రేమను చాటిన పెదవులు (2)
ఏ లేమికి కలత చెందరు – ఏ నలతకు తలలు వంచరు
ప్రభు సేవలో ధీరులు వీరు – తన చిత్తము ఎరిగిన వారు (2)

యేసును ప్రేమించి వారు ద్వేషనముకు గురి అయినారు
జీవమును చాటించుటకై మరణానికి బలి అయినారు (2)
తమ సిలువను ఎత్తుకొని – ప్రభు బోధను పాటించారు
ప్రభు చిత్తము నెరవేర్చి – తన సన్నిధినే చేరారు (2)      ||ఏ లేమికి||

లోకము చీకటి బాపుటకు వెలుగులు వెదజల్లిన వారు
తమ పాదాలకు ప్రభు వాక్యము దీపముగా వెలిగించారు (2)
తమ దేహము యాగముగా – శోధనలు జయించినారు
తమ సాక్ష్యము పెంచుకొని – ప్రభు రక్షణను పంచారు (2)      ||ఏ లేమికి||

Your favourites

  • No Favourites found!