Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని Telugu Christian Song Lyrics

స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని Lyrics

స్వాస్థ్యముగా నిచ్చితివి జయించెడు వానికన్ని
1. నీవే మాకు దేవుడవై యున్నావు
మేము నీదు పుత్రులమైతిమి
నీ స్వంత రక్తము నిచ్చి
కొన్నావు నీ సొత్తుగా
2. నిన్నంగీకరించిన వారలందరిని
నీ నామమందు నమ్మిన వారిన్
నీ పిల్లలుగాను జేసి
అధికారమిచ్చితివి
3. నీతో కూడా మహిమను పొందుటకు
నీ శ్రమలలో పాలు పొందుటచే
నీ తోటి వారసులముగా
పరిగణింపబడితిమి
4. అక్షయమైన నిర్మలమైనదియు
వాడబారని స్వాస్థ్యము కొరకై
మరల జన్మింపగా జేసి
స్థిరముగా నుంచితివి
5. నీ శాసనములు హృదయానందములు
అవి అన్నియు మాకు నిత్య స్వాస్థ్యముగా
భావించి నిలిచి యున్నాము
హల్లెలూయ గీతములతో


Your favourites

  • No Favourites found!