Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసిఅను Telugu Christian Song Lyrics

స్వచ్ఛంద సీయోనువాసి సర్వాధికారి కస్తూరి పూరాసిఅను Lyrics

స్వచ్ఛంద సీయోనువాసి - సర్వాధికారి - కస్తూరి పూరాసి
అను వర్తమాన భూతభవి - ష్యత్కాలవాసి
అల్ఫా ఓమేగ తానే - ఆద్యంతము మన యేసే
1. ఇదిగో నేనొక నిబంధనను - అద్భుతముల జేతున్
నీ ప్రజలందరి యెదుట
పరిశోధింపజాలని మహా - పనులెల్ల ప్రభువే
లెక్కలేని యద్భుతముల్ - మక్కువతో చేయువాడు
2. సంగీత నాదములతోడ - సీయోనుపురము సొంపుగను చేరితిమి
శాశ్వత సంతోషము మా - శిరములపై వెలసెన్
దుఃఖము నిట్టూర్పును పోయెన్ - మిక్కిలి ఆనందముగల్గెన్
3. నీలముల పునాదులు వేసి - నీలాంజనములతో - మాణిక్య మణులతో
సువర్ణ శునీయముల - సూర్యకాంతముతో
ప్రశస్త రత్నములతో - ప్రవిమలముగ నినుగట్టెదను
4. సుమముల హారము - సంతోషానంద తైలము నీదే
స్తుతి వస్త్రమును నీదే - ఉల్లాసవస్త్రంబు నీదే - విడుదలయు నీదే
హితవత్సరము విముక్తి - ఆత్మాభిషేకము నీదే
5. జలములలోబడి దాటునప్పుడు - బలమై యుండెదను
నీతోడై యుండెదను - నదులలో వెళ్ళునప్పుడు - నీపై పారవు
అగ్ని మధ్యను నడచినను - జ్వాలలు నిను కాల్చగలేవు
6. ఇత్తడి తలుపుల బగుల గొట్టెద - నినుప గడియలను
విడగొట్టెదను నేను - అంధకారస్థలములలో ను-న్నట్టి నిధులను
రహస్యములో మరుగైన - ధనమును నీ కొసంగెదను
7. గర్భమున పుట్టినది మొదలు - తల్లి యొడిలోన
కూర్చుండినది మొదలు - నేను చంక బెట్టుకొన్న - నాదు ప్రజలారా
ముదిమి వచ్చువరకు నిన్ను - ఎత్తుకొను వాడను నేనే


Your favourites

  • No Favourites found!