Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
స్వఛ్చంద సీయోను వాసిసర్వాధికారి  కస్తూరి Telugu Christian Song Lyrics

స్వఛ్చంద సీయోను వాసిసర్వాధికారి కస్తూరి Lyrics

స్వఛ్చంద సీయోను వాసి
సర్వాధికారి – కస్తూరి పూరాసి (2)
వర్తమాన భూత భవి-ష్యత్కాల వాసి (2)
అల్ఫా ఒమేగ తానే (2)
ఆద్యంతము మన యేసే (2) ||స్వఛ్చంద||
ఇదిగో నేనొక నిబంధనను
అద్భుతములు జేతున్ – నీ ప్రజలందరి యెదుట (2)
పరిశోధింపజాలని మహా – పనులెల్ల ప్రభువే (2)
లెక్క లేని యద్భుతముల్ (2)
మక్కువతో చేయువాడు (2) ||స్వఛ్చంద||
సంగీతం నాదముల తోడ
సీయోను పురము – సొంపుగను చేరితిమి (2)
శాశ్వత సంతోషము మా – శిరములపై వెలసెన్ (2)
దుఃఖము నిట్టూర్పును పోయెన్ (2)
మిక్కిలి ఆనందము కల్గెన్ (2) ||స్వఛ్చంద||
నీలముల పునాదులు వేసి
నీలాంజనములతో – మాణిక్య మణులతో (2)
సువర్ణ శునీయముల – సూర్య కాంతముతో (2)
ప్రశస్త రత్నములతో (2)
ప్రవిమలముగా నిను గట్టెదను (2) ||స్వఛ్చంద||
సుమముల హారము
సంతోషానంద తైలము నీదే – స్తుతి వస్త్రమును నీదే (2)
ఉల్లాస వస్త్రంబు నీదే – విడుదలయి నీదే (2)
హిత వత్సరము విముక్తి (2)
ఆత్మాభిషేకము నీదే (2) ||స్వఛ్చంద||
జలములలో బడి దాటునప్పుడు
బలమై యుండెదను – నీ తోడై యుండెదను (2)
నదులలో వెళ్లునప్పుడు – నీపై పారవు (2)
అగ్ని మధ్యను నడచినను (2)
జ్వాలలు నిను కాల్చగ లేవు (2) ||స్వఛ్చంద||
ఇత్తడి తలుపుల బగుల గొట్టెద
నినుప ఘడియలను – విడగొట్టెదను నేను (2)
అంధకార స్థలములలో ను-న్నట్టి నిధులను (2)
రహస్యములో మరుగైన (2)
ధనమును నీ కొసంగెదను (2) ||స్వఛ్చంద||
గర్భమున పుట్టినది మొదలు
తల్లి యొడిలోన – కూర్చుండినది మొదలు (2)
నేను చంక బెట్టుకొన్న – నాదు ప్రజలారా (2)
ముదిమి వచ్చుఁ వరకు నిన్ను (2)
ఎత్తుకొను వాడను నేనే (2) ||స్వఛ్చంద||

Your favourites

  • No Favourites found!