Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక Telugu Christian Song Lyrics

తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక Lyrics

తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికిని సహాయము చేయ గలవాడై యున్నాడు. హెబ్రీ Hebrews 2:18ఓ భక్తులారా మనమందరము
నిత్యము యేసుని స్తుతియించెదము
1. గత కాలమున మన ప్రభుయేసు
నూతన దీవెనలను - ఖ్యాతిగా నొసగే మనకు
స్తుతియించెద మేసుని
నూతన అనుభవములను - ఖ్యాతిగా సర్వశక్తుని
2. శక్తిమంతుడు మన ప్రభు యేసు
నిత్యమును దీవించును - రక్షించును మనలను తానే
సంపూర్ణముగా కాయున్
సత్యవంతుడు మన ప్రభువు - మాట తప్పని మహారాజు
3. ఎన్ని శోధనలు భువినున్న
తానే మనలను విడిపించును - శోధింపబడెను యేసు
తన సహాయము నొసగున్
కనుపాపవలె ప్రభువు కాయున్ - నిత్యము నిలుచు మనతో
4. శక్తిమంతుడు మన ప్రభు యేసు
తొట్రిల్లకుండ కాపాడును - నిర్దోషులనుగా ప్రభువు
నిలుపును తన మహిమతో
తలచుము తన కృపలను - ఎన్నడు విడువడు మనల
5. కృంగిన భక్తులారా మీరు
భంగపర్చు శత్రువుపై జగముపై చాటుడి - జయము
జయము జయమని ప్రభుకే
యుగ యుగములు మన ప్రభుకే - హల్లెలూయ గీతములతో

Your favourites

  • No Favourites found!