తార వెలిసింది ఆ నింగిలో ధరణి మురిసింది
దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది (2)
రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని (2)
మందను విడచి మమ్మును మరచి మేమంతా కలిసి వెళ్లాములే
ఆ ఊరిలో ఆ పాకలో స్తుతి గానాలు పాడాములే (2)
సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే
స్తోత్రార్పణే మా రారాజుకే ఇది క్రిస్మస్ ఆర్భాటమే
బంగారమును సాంబ్రాణియు బోళంబును తెచ్చాములే
ఆ యింటిలో మా కంటితో నిను కనులారా గాంచాములే (2)
మా ఇమ్మానుయేలువు నీవేనని నిను మనసారా కొలిచాములే
మా యూదుల రాజువు నీవేనని నిను ఘనపరచి పొగిడాములే
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తార వెలిసింది ఆ నింగిలో ధరణి Lyrics
Your favourites
- No Favourites found!
