తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమా
తలవంచకు ఎప్పుడు తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లొకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లొకంలో
కన్నులు నెత్తికి వచ్చిన లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ మాదిరి
నీవు ఇవ్వాలి ఓ ప్రేరణ
నీవు మండాలి ఓ జ్వాలగా
నీవు చేరాలి ఓ గమ్యము
1. చీకటిని వెనుకకు త్రోసి సాగిపోముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం ఇకపై లేవులే
క్రీస్తును చేరు లోకాన్ని వీడు విజయం నీదేలే
॥తలవంచకు॥
2. పెకలించు కొండలను విశ్వాస బాటలొ
గెలవాలి యుద్ధ రంగంలో దైవిక బలముతో
యేసుని కృప నీలోనే ఉంది సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు నిలిచిపో జగతిలో
॥తలవంచకు॥
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తలవంచకు నేస్తమా తలవంచకు నేస్తమాతలవంచకు ఎప్పుడు Lyrics
Your favourites
- No Favourites found!
