Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి Telugu Christian Song Lyrics

తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి Lyrics


తల్లికున్నదా - తండ్రికున్నదా - నీ ప్రేమ జాలి యేసయ్యా..
అన్నదమ్ములకైనా - కన్నబిడ్డలకైనా - నీ ప్రేమ లేదు యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..


ఏ యోగ్యత లేదనుచూ నా అనువారే - ఇంటినుండి వెలివేసితిరొకనాడయ్యా..
రోగముతో రోధిస్తూ వేదనపడుచున్ననూ - అవహేళన చేసితిరి బంధువులయ్యా..
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే - నా పరమవైద్యుడ నీవయ్యా..
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..


ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి - నీ ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా..
జ్ఞానము ఐశ్వర్యమును ఇచ్చితివయ్యా - మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి..
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివే - నా మంచి కాపరి నీవయ్యా..
యేసయ్యా యేసయ్యా - మంచి యేసయ్యా..
యేసయ్యా యేసయ్యా - నా మంచి యేసయ్యా..

Your favourites

  • No Favourites found!