Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప Telugu Christian Song Lyrics

తమ దేవునెరుగువారు చేసెదరు శక్తితో గొప్ప Lyrics

తమ దేవునెరుగువారు చేసెదరు - శక్తితో గొప్ప కార్యములు
1. ఇచ్చకపు మాటల వలన - అక్షయుని విడువరు
తప్పుబోధల నెపుడు తృణీకరించెదరు
2. సత్యమును విడువరు - ఉత్తములుగ నడిచెదరు
అతల్యాను హతము చేసెదరు శుద్ధులై యుండెదరు
3. మనుజ భయము జెందరు - మాన్యులై యుండెదరు
మంచి సాక్షమును విడువరు ఏకాంతులు కారు
4. ద్వేషించెదరు విగ్రహముల్ - శిరములు ఖండించినను
పర్వతమువలె కదలక వారు స్థిరముగ నుండెదరు
5. అగ్నిలో వేయబడినను - విఘ్నంబులు కలిగినను
సింహపు బోనులో వేసినను సిగ్గునొందరు
6. శోధనలను జయించెదరు - బాధలను సహించెదరు
నాథుడేసుని సదా వెదకి సాధించి ప్రకటింతురు
7. అదిక జ్ఞానమును పొంది - తగ్గించె కొనెదరు తామే
యేసు ప్రభువును హెచ్చించెదరు హల్లెలూయ పాడెదరు


Your favourites

  • No Favourites found!