తన రాజ్యమునకు మహిమకు పిలచిన - 2
మన ప్రభువుకు తగినట్టు నడిచెదము
తన రాజ్యములో మనము చేరెదము
1. కారుచీకటి కమ్మినను - యేసుని వెలుగులో నడిచెదము - 2
మంచి కాపరి మనతోనుండగ - తనతో ముందుకే సాగెదము - 2
2. ఇరుకు మార్గపు ఇబ్బందులలో - సిలువను మోయుచు వెళ్ళెదము
యేసే మనదు భారము మోయుచు - మనకు మార్గము చూపును
3. ఉప్పొంగుచున్న ఉపద్రవములలో - ఉన్నవాడనని ప్రభువనెను
అంతము వరకు చెంత నిలిచి - తానే మనతో నడచును
4. దారితొలగక గురి యొద్దకే - యేసునే చూచి నడచెదము
ఇహమున శుద్ధులై నడచువారే - పరమున ప్రభువుతో సంచరించెదరు
5. విశ్వాసమును విడువక - మంచి పోరాటం పోరాడి
ప్రభువుతో నడచి పరుగు ముగించి - నీతి కిరీటము పొందెదము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తన రాజ్యమునకు మహిమకు పిలచిన Lyrics
Your favourites
- No Favourites found!
