Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు Telugu Christian Song Lyrics

తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు Lyrics

తన యక్రమములకు క్షమా పణ నొందినవాఁడు తన పాప ములకు
బ్రాయశ్చిత్తము బును బొందినవాఁడును ధణ్యుండౌ ||తన||

1. దేవుని చేత ని ర్తోషిగఁ దీర్చఁ బడిన వాఁడు భావంబున లేశం
బయినను గ పటము లేనివాఁడును ధన్యుండౌ ||తన||

2. మునునేని మౌని నై దిన దినమున నేనొనం చిన నా యార్త ధ్వనిచే
క్షీణిం చెను నా యెముకలు సకలం బకటా ||తన||

3. రేయి పగలు నా మీఁ దను నీ చేయి భారమయ్యెఁ గాయము నందలి
సారము వేసవి కాలంబున నెండిన విధ మాయెను ||తన||

4. కప్పుకొనకయే నీ యెదుటఁ గలుష మెప్పుకొంటి నొప్పుకొందు
ననుకొంటి నక్రమ మోర్పుతోడఁ బాపము మన్నించితి ||తన||

5. కావున నీ సంద ర్శనపుఁ గాలమందు భక్తుల్ భావము రంజిల నినుఁ
బ్రార్థింత్రు ప్ర వాహంబులు వారలపైఁ బొరలవు ||తన||

6. దాగు చోటు నీవే శ్రమలను దప్పించెద వీవే వేగ విమోచన గానంబులతో
విడువక నీవే యావరించెదవు ||తన||

7. నీ కుపదేశింతు మార్గము నీకును బోధింతు నీ కాలోచన నేఁ జెప్పె
దను నీ మీఁదను దృష్టించి సతంబు,ను ||దన||

8. జ్ఞానము లేనట్టి గుఱ్ఱమ ట్లైనను ఖరమువలె నైనను మీరుండకుఁ
డని కళ్లెము తో నెంతో బిగియింపఁబడవలెఁ ||దన||

9. కలుగు ననేకములౌ వేద నలు కడు భక్తి విహీ నులకు నమిత కృప
దేవుని విశ్వా సులఁ జుట్టుకొని యుండు నిజంబుగ ||దన||

10. సంతోషించుఁడి నీతి మంతులార సత్య స్వాంతులారా మీరంద
ఱత్యంత సంతోషంబున గానముఁ జేయుడి ||తన||

11. జనక తనయ పరిశు ద్ధాత్మ కును మహిమము గల్గు మును పిప్పుడు
నెల్లప్పుడు యుగముగ ములకును దనరారును గాకామేన్ ||జనకతనయ||

Your favourites

  • No Favourites found!