తనువు నా దిదిగో గై కొనుమీ యో ప్రభువా నీ పనికిఁ బ్రతిష్టించుమీ
దినములు క్షణములు దీసికొని యవి నీదు వినతిన్ బ్రవహింపఁ జే
యను శక్తి నీయుమీ ||తనువు||
1. ఘనమైన నీ ప్రేమ కారణంబున నీకై పనిచేయఁ జేతు లివిగో
యనయంబు నీ విషయ మై సొగసుగాఁ జురుకు దనముతో ఁ బరుగెత్త
వినయ పాదము లివిగో ||తనువు||
2. స్వర మిదిగో కొనుమీ వరరాజ నిను గూర్చి నిరతమ్ము పాడనిమ్ము
మరియు పెదవు లివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో ఁ బరి
పూర్ణముగ నింపు ||తనువు||
3. వెండి పసిఁడి యివిగో వీస మైనను నాకై యుండవలె నని కోరను
నిండైన నీ యిష్ట నియమంబు చొప్పున మెండుగ వాడఁ బరి మితయౌ
జ్ఞానం బిదిగో ||తనువు||
4. నా యిష్ట మిదిగో యిది నీ యిషముగఁ జేయ నా యిష్ట మిఁకఁ గాదది
నా యిచ్ఛ యున్నట్టి నా హృదయ మిదిగో నీ కే యియ్యది రాజ
కీయ సింహాసనమౌ ||తనువు||
5. ఉన్న నా ప్రేమ నీ సన్నిధానమున నే నెన్నఁడు ధార వోయన్ నన్ను
నీ వానిగ నాధా గైకొను మపుడు చెన్నుగ నీ వశమై స్థిర ముగ
నుండెదఁ ||తనువు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తనువు నా దిదిగో గై కొనుమీ Lyrics
Your favourites
- No Favourites found!
