Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడి విజయులుగా యిలలో Telugu Christian Song Lyrics

తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడి విజయులుగా యిలలో Lyrics


తేజస్సంబంధులారా క్రీస్తుని ధరించుకొనుడి
విజయులుగా యిలలో ఉజ్జీవము నొందుడి
అ.ప. ఉజ్జీవము నొందుడి జయ ధ్వని చేయుడి
శుభవార్త చాటుడి స్తొత్రార్పణనర్పించుడి (2)

1. నలిగిన నిన్ను లేవనెత్తున్
నీటి యూటగ చేయున్
భావి తరాలకు నాందిగా చేయున్
లెమ్ము తేజరిల్లుము (2)
శోధనలో పడకుండునట్లు (2)
ప్రభునకు సర్వ౦ అర్పించుము

2. భారము మోసెడి తన ప్రియసుతులకు
యేసుడు నెమ్మది నిచ్చున్
కన్నీరు కారే నీ కన్నులను
ప్రేమతో తుడిచి హత్తుకొనున్ (2)
స్థిరపరచి హెచ్చించును (2)
హొసన్ననుచూ పాడుడి

3. ఏ ఘడియైన వరుడు శ్రీయేసు
మేఘారూఢుడై రానుండె
ఆకాశమందాయనను సంధింప
యేసుతో నేగ ఆయత్తమా? (2)
జీవకీరీటము పొందెదము (2)
క్రీస్తుని పోలి యుందుము

Your favourites

  • No Favourites found!