Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌను నీవు Telugu Christian Song Lyrics

తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌను నీవు Lyrics


తేనియకంటెను యేసుని నామం దివ్యమధురమౌను
నీవు వరుగిడి రమ్ము దివ్య సన్నిధికి దినము ఓ మనసా

1.లోకములోన కష్టములెల్ల యేసుడు భరియించెన్
పాపకీడును బాపెన్ శాపము మాపెన్ తెలిసికో ఓ మనసా

2.పాపిన్ రక్షింప ప్రాణము నిచ్చెన్ యేక కుమారుండు
ఇది యెంతటి కరుణ నిరింతర ముండును స్తుతించుము ఓమనసా

3. అరుణోదయమున మంచువలె ఈ లోకము మాయమగున్
నీవు యేసుని నామం నిరతము నమ్ము హత్తుకో ఓ మనసా

4. కష్టములోన సంతోషమిచ్చు మిత్రుడు ఆ ప్రభువే
తన రెక్కలక్రింద ఆశ్రయమిచ్చున్ నిశ్చయం ఓ మనసా

5. భూలోక వాసుల్ పరలోక వాసుల్ ప్రభువును స్తుతించుడి
యేసు నెరిగిన వారే పరమున చేర తగుదురు ఓ మనసా

Your favourites

  • No Favourites found!