Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తార జూపిన మార్గమదే… Telugu Christian Song Lyrics

తార జూపిన మార్గమదే… Lyrics

తార జూపిన మార్గమదే… జ్ఞానులు చేరిన గమ్యమదే…
గొల్లలు గాంచిన స్థానమదే… లోక రక్షకుని గూర్చినదే…

ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది (2)
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా….

తార జూపిన మార్గమదే – జ్ఞానులు చేరిన గమ్యమదే
గొల్లలు గాంచిన స్థానమదే – లోక రక్షకుని గూర్చినదే (2)
ఇమ్మానుయేలు జననమది – పాపికి పరలోక ద్వారమది
పరిశుద్ధ ప్రవక్తలు పలికినది – పరలోక సైన్యము పాడినది (2)

ఆహా హల్లెలూయా.. ఆహా హల్లెలూయా..
ఆహా హల్లెలూయ.. ఆహా హల్లెలూయ..
ఆహా హల్లెలూయా.. ఆహా హల్లే.. లూయా..    ||తార జూపిన||

దైవాజ్ఞను ధిక్కరించుటయే – పాపము ఓ సోదరా
ఆ పాపముతో లోకమంతా – నిండిపోయెను సోదరీ (2)
పాపమేమో మరణమును వెంట దెచ్చెగా
ఆ మరణమేమో నీకు నాకు సంక్రమించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరా
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా
భయము లేదు మనకింకా ఓ సోదరీ
అభయమదిగో క్రీస్తేసు జన్మించెగా.. ఆ.. ఆ.. ఆ..    ||ఆహా హల్లెలూయా||

దైవ చిత్తము నెరవేర్చుటకే – క్రీస్తేసు పరము వీడగా
పాప రుణమును చెల్లించుటకై – పావనుడే పుడమి చేరెగా (2)
సిలువలో సాతాను తల చితకద్రొక్కెగా
రుధిరమిచ్చి నిన్ను నన్ను శుద్ధి చేయగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరా
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా
బంధకములు తెంపబడెగా ఓ సోదరీ
సమాధి గెలిచి యేసయ్య తిరిగి లేచెగా.. ఆ.. ఆ.. ఆ..    ||ఆహా హల్లెలూయా||

దైవ వాక్యము బోధించుటకు – పావనాత్మ పంపబడెగా
లోక పాపము ఒప్పించుటయే – ఆదరణకర్త కార్యమాయెగా (2)
అంధకారమంత బాపి వెలుగు నిచ్చుగా
అనుదినము నిన్ను నన్ను నడిపించునుగా
సందేహమేల సమయమిదే ఓ సోదరా
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా
సందేహమేల సమయమిదే ఓ సోదరీ
నిను రక్షించుటకేసయ్య చేయి చాచగా… ఆ.. ఆ.. ఆ..    ||ఆహా హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!