Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తలవంచకు నేస్తమా Telugu Christian Song Lyrics

తలవంచకు నేస్తమా Lyrics

తలవంచకు నేస్తమా (2)
తలవంచకు ఎప్పుడూ
తలవంచకు ఎన్నడూ
స్వార్ధపుటంచున ఊగిసలాడే లోకంలో
కుడి ఎడమలకు బేధం తెలియని లోకంలో
కన్నులు నెత్తికి వచ్చిన ఈ లోకంలో
ప్రేమకు అర్ధం గ్రహించలేని లోకంలో
నీవు కావాలి ఓ.. మాదిరి
నీవు ఇవ్వాలి ఓ.. ప్రేరణ
నీవు మండాలి ఓ.. జ్వాలగా
నీవు చేరాలి ఓ.. గమ్యము        ||తలవంచకు||

చీకటిని వెనుకకు త్రోసి – సాగిపో ముందుకే
క్రీస్తు బాటలో పయనిస్తే – ఎదురేమున్నది
రేపటి భయం నిందల భారం – ఇకపై లేవులే
క్రీస్తుని చేరు లోకాన్ని వీడు – విజయం నీదేలే (2)       ||నీవు||

పెకిలించు కొండలను – విశ్వాస బాటలో
గెలవాలి యుద్ధ రంగంలో – దైవిక బలంతో
యేసుని కృప నీతోనే ఉంది – సాధించు ప్రగతిని
మంచిని పెంచు ప్రేమను పంచు – నిలిచిపో జగతిలో (2)       ||నీవు||

Your favourites

  • No Favourites found!