Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తల్లి తన బిడ్డను మరచినా గాని Telugu Christian Song Lyrics

తల్లి తన బిడ్డను మరచినా గాని Lyrics

తల్లి తన బిడ్డను మరచినా గాని
మరువదయ్యా నీ ప్రేమ నన్ను
పర్వతములు తొలగినా గాని
విడువదయ్యా నీ కృప నన్ను (2)
దుఃఖ దినములే దరి చేరినా
దారి కానక నే చెదరినా (2)
మరువదయ్యా నీ ప్రేమ నన్ను
విడువదయ్యా నీ కృప నన్ను ||తల్లి||
నశించిపోయిన నన్ను వెదకి రక్షించినావు
పాపినైన నాకై నీ ప్రాణమునర్పించినావు (2)
నీతిమంతుని కొరకైననూ
ఒకరు చనిపోవుట అరుదుగా (2)
ఏ మంచియు లేనట్టి నాకై
ఎందుకయ్యా నీ త్యాగము (2) ||దుఃఖ దినములే||
దారి తొలగిన నేను గొర్రె వలె తిరిగాను
కాపరివైన నిన్ను కాదని వేసారినాను (2)
నీవు చేసిన మేళ్లన్ని మరచి
దూరమైతిని నిను నేను విడచి (2)
అయిననూ నా రాక కొరకై
వేచియుంటివా ఓ జాలి హృదయా (2) ||దుఃఖ దినములే||

Your favourites

  • No Favourites found!