Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో Telugu Christian Song Lyrics

తప్పిపోయిన గొర్రెను నేను నీ దరికి చేర్చుకో Lyrics

తప్పిపోయిన గొర్రెను నేను
నీ దరికి చేర్చుకో యేసయ్య (2)
యజమానుడా నా యజమానుడా 
నీవు తప్ప నాకు ఎవరూలేరయ్యా (2)

1. నిన్ను చేరే మార్గములో నేనుండగా
ముల్లె నా కాళ్లకు అడ్డుగా ఉన్నది (2)
నా దారిలో వెలుగువై
నా చెంతకు నీవు చేరువై
నా దరికి నీవు రావా నా యేసయ్య (2) || తప్పిపోయిన ||

2. అందరు ఉన్నను ఒంటరినైతిని
చెంతనేవున్నను నీకు దూరముగుంటిని  (2)
నీతోనే నేను ఉండాలని
నీతోనే నేను నడవాలని
ఆశతో ఉన్నాను యేసయ్య  (2) || తప్పిపోయిన ||

Your favourites

  • No Favourites found!