Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తీయని స్వరాలతో Telugu Christian Song Lyrics

తీయని స్వరాలతో Lyrics


తీయని స్వరాలతో నా మనసే నిండెను
యేసుని వరాలతో నా బ్రతుకే మారెను
భావమధురిమ ఉప్పొంగెను
రాగసుధలతో భాసిల్లెను (2)
పరవశించి నిను స్తుతించి
ఘనపరచెద వైభవముగా         ||తీయని||

ఏదేమైనా ఏనాడైనా నీ దారిలో నేను
నీవే నాకు ఆప్తుడైన నిన్నాశ్రయించాను
సజీవుడా నీవే లేని నేనే వ్యర్ధము
ఏదేమైనా ఏనాడైనా నీ దారిలోనేను
యేసుతో రాజ్యము చేసే భాగ్యము
నాకు దొరికె కనికరము – తనువు పరవశము         ||తీయని||

ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
నిన్నేనమ్మి జీవించేను నీలో ఫలించేను
సహాయుడా నీలోనేగా నా సాఫల్యము
ఆరాధన యోగ్యుడైన నీ సొంతమే నేను
యేసుని సన్నిధి చేరే భాగ్యము
నాకు కలిగె అనుగ్రహము – తనువు పరవశము         ||తీయని||

Your favourites

  • No Favourites found!