Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
తేనెకన్న తీయనైనది Telugu Christian Song Lyrics

తేనెకన్న తీయనైనది Lyrics


తేనెకన్న తీయనైనది
నా యేసు ప్రేమ – మల్లెకన్న తెల్లనైనది (2)
నన్ను ప్రేమించెను నన్ను రక్షించెను
కష్టకాలమందు నాకు తోడైయుండెను (2)     ||తేనెకన్న||

ఆగకనే సాగిపోదును
నా ప్రభువు చూపించు బాటలో (2)
అడ్డంకులన్ని నన్ను చుట్టినా
నా దేవుని నే విడువకుందును (2)           ||తేనెకన్న||

నా వాళ్ళే నన్ను విడిచినా
నా బంధువులే దూరమైనా (2)
ఏ తోడు లేక ఒంటరినైననూ
నా తోడు క్రీస్తని ఆనందింతును (2)           ||తేనెకన్న||

Your favourites

  • No Favourites found!