తూర్పు దిక్కు చుక్క బుట్టె
మేరమ్మా – ఓ మరియమ్మా (2)
చుక్కను జూచి మేము వచ్చినాము
మొక్కి పోవుటకు (2) ||తూర్పు దిక్కు||
బెత్లెహేము పురము లోని బాలుడమ్మా
గొప్ప బాలుడమ్మా (2)
మన పాపముల బాప పుట్టెనమ్మా
మహిమవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||
పశువుల పాకలోని బాలుడమ్మా
పాపరహితుడమ్మా (2)
పాపంబు బాపను పుట్టెనమ్మా
సత్యవంతుడమ్మా (2) ||తూర్పు దిక్కు||
బంగారం సాంబ్రాణి బోళం తెచ్చినాము
బాల యేసు నొద్దకు (2)
బంగారు పాదముల మ్రొక్కెదము
బహుగ పాడెదము (2) ||తూర్పు దిక్కు||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
తూర్పు దిక్కు చుక్క బుట్టె మేరమ్మా Lyrics
Your favourites
- No Favourites found!
