Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ Telugu Christian Song Lyrics

త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ Lyrics

త్రిత్వమై నిత్యత్వమున నేకత్వమగు దేవా నీ సత్యసామర్థ్యత్వముల
నిజ తత్వము గణించి నిను నిత్యము స్తుతించెదను ||త్రిత్వమై||

1.
ఎల్లలోకంబుల సృజించిన చల్లని తండ్రి నా యుల్లమున నీ గొప్ప వింత
లెల్ల సంతసిల్ల శోభిల్లఁ దలంచెదను ||త్రిత్వమై||

2.
వాసి కెక్కిన పరమరాజ్యని వాసమును విడిన శ్రీ యేసునాధుండను
కుమారా దోషుల దోసంబులెల్లఁ గాచి రక్షించినావు ||త్రిత్వమై||

3.
ఆదరణకారుండ వగు శుద్ధాత్ముడా దేవా యామోద నామము
నంపఁబడి యేసు నాధుని సుబోధ లెల్ల బోధపరచి పాదుకొల్పు ||త్రిత్వమై||

4.
ఓపితా సుతా శుద్ధాత్మ ఒక్క దేవుఁడవు ఎల్ల పాపులను రక్షింప
మిగుల నోపికతో నాపదలు బాపి కృపఁ జూపినావు ||త్రిత్వమై||

Your favourites

  • No Favourites found!