Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణమునిమ్ము విలువ Telugu Christian Song Lyrics

త్రిత్వమర్మము నెరిగిన మిత్రుండా ప్రాణమునిమ్ము విలువ Lyrics

త్రిత్వమర్మము నెరిగిన - మిత్రుండా ప్రాణమునిమ్ము
విలువ గలిగిన ప్రభుని - సిలువ భుజముపై మోసి
1. గోధుమ భూమిలోపడిన - బహుగాను ఫలియించును
మోదమున ప్రభుయేసునితో మరణించవలెను ప్రియుడా
2. మహిమ నొందుటకు నీవు సాత్వికుండవు కావలెను
మహిమ స్వరూపిని పోలి - నీవును జీవించవలెను
3. క్రీస్తును ప్రేమను త్రాగి - ఆత్మవశుడవైనచో
సైతాను సహవాసమును - సంపూర్ణముగా వదిలెదవు
4. పొలము దున్నెడువాడు - వెనుక తిరిగి చూడడు
ఇలలో నీవున్నను ప్రియుడా - యిలనే మరచిపోవలెను
5. ప్రాణంబు పోయినగాని - విశ్వాసము విడువ వలదు
ప్రియుడా నీదు ద్వారానే - పృథివి బాగుపడవలెను


Your favourites

  • No Favourites found!