త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే నమ్మి సేయుదు సేవ దేవ
పరలోక భూలోక ముల నెల్లఁ బుట్టించి పాలించు తండ్రి దే వుని
నమ్మెదను నేను ||త్ర్యేక||
1. శ్రీ దేవసుతుఁ డేసు క్రీస్తే యేక చిరజీవ నాధుండు నాకే దేవ కన్య
మరియమ్మ గ ర్భమున జన్మించిన కరుణగల దేవునిఁ గూర్మితో నమ్మెదఁ
||ద్ర్యేక||
2. పొంతి పిలాతు కాలమున యేసు పొంది శ్రమలను సిలువమీద
దేవ కొట్టఁబడి చనిపోయి పెట్టఁబడి భూమిలో మూఁడవ దినమందు
మృతి గెలిచి లేచెను ||త్ర్యేక||
3. పరలోకమున కెక్కె యేసు క్రీస్తు పరమతండ్రికిఁ గుడివైపు దేవ
సింహాసనముమీఁద స్థిరముగాఁ గూర్చుండి యున్నాఁడు చిరన్యాయ
కర్తయై యున్నాఁడు ||త్ర్యేక||
4. అక్కడనుండి ప్రభు యేసు వచ్చు నిక్కముగఁ దీర్పుఁ దీర్చుటకు దేవ
మరణ మొందినవారికి బ్రతికి యున్నవారికి న్యాయంబుఁ దీర్చును
న్యాయవంతుఁడు యేసు ||త్ర్యేక||
5. శుద్ధాత్మ దేవుని నేను మన శుద్ధితో నమ్మి కొల్చెదను దేవ శుద్ధ
సంఘంబు పరి శుద్ధుల సహవాస మును నమ్మెదను నిత్య మును నేను
నిజ మిది ||త్ర్యేక||
6. పాపక్షమాపణను నేను ఎంతో బలముగా నమ్మెద నిలను దేవ ఈ
శరీరముపోయి యంత్యదినమున మరల లేచునని తిరముగా వాసిగా
నమ్మెదఁ ||త్ర్యేక||
7. నిత్యజీవము నమ్మెదను నేను నిజముగా శ్రీ యేసు పేర దేవ నిత్యుండు
తండ్రి దే వుఁడు కుమారుండును ఆత్ముండు సత్యుండు త్ర్యేకుఁడౌ
దేవుండు ||త్ర్యేక||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
త్ర్యేక దేవుఁడ యెహోవ దేవు నే Lyrics
Your favourites
- No Favourites found!
