ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమున
మహిమ క్రీస్తు ఉదయించెను రక్షణ వెలుగునియ్యను - 2
1. ఘోరాంధకారమున దీపంబులేక - పలుమారు పడుచుండగా
దుఃఖ నిరాశ యాత్రికులంతా - దారితప్పియుండగా
మార్గదర్శియై నడిపించువారిన్ - ప్రభుపాద సన్నిధికి
దివ్యరక్షకుడు ప్రకాశ వెలుగు - ఉదయించె ఈ ధరలో
2. చింతవిచారముతో నిండియున్న - లోకరోదనవిని
పాపంబునుండి నశించిపోగా - ఆత్మవిమోచకుడు
మానవాళికై మరణంబునొంది - నిత్య జీవము నివ్వన్
దివ్యరక్షకుడు ప్రకాశతార - ఉదయించె రక్షింపను
3. పరలోక తండ్రి కరుణించి మనల - పంపెను క్రీస్తుప్రభున్
లోకాంధులకు దృష్టి నివ్వ - అరుదెంచె క్రీస్తు ప్రభువు
చీకటినుండి దైవ వెలుగునకు - తెచ్చె క్రీస్తు ప్రభువు
సాతాను శృంఖలములను తెంప - ఉదయించె రక్షకుడు
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఉదయించె దివ్య రక్షకుడు ఘోరాంధకార లోకమునమహిమ Lyrics
Your favourites
- No Favourites found!
