Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద Telugu Christian Song Lyrics

ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద Lyrics

ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి కో రక్షకా యెన్న
శక్యముగాని పాపము లన్ని మోపుగ వీపుపైఁబడి యున్న విదె నడలేక
తొట్రిలు చున్నవాఁడను నన్ను దయఁగను ||ఉన్న||

1. కారుణ్యనిధి యేసు నా రక్షకా నీ శ రీర రక్తము చిందుట భూరి
దయతో నన్ను నీదరిఁ జేర రమ్మని పిలుచుటయు ని ష్కారణపు నీ ప్రేమ
యిది మరి వేరే హేతువు లేదు నా యెడ ||ఉన్న||

2. మసి బొగ్గువలె నా మా నస మెల్లఁ గప్పె దో ష సమూహములు
మచ్చలై అసిత మగు ప్రతి డాగు తుడువను గసుటుఁ గడిగి పవిత్ర్ర
పరపను నసువు లిడు నీ రక్తమే యని మసల కిప్పుడు సిలువ నిదె గని
||ఉన్న||

3. వెలపట బహు యుద్ధ ములు లోపటను భయము కలిగె నెమ్మది దొల
గెను పలు విధములగు సందియంబుల వలనఁ బోరాటములచే నే
నలసి యిటునటుఁ గొట్టఁబడి దు ర్భలుఁడనై గాయములతో నిదె ||ఉన్న||

4. కడు బీదవాఁడ నం ధుఁడను దౌర్భాగ్యుఁడను జెడిపోయి పడి
యున్నాను సుడివడిన నా మదికి స్వస్థతఁ జెడిన కనులకు దృష్టి భాగ్యముఁ
బడయవలసిన వన్ని నీ చేఁ బడయుటకు నా యెడ యఁడా యిదె
||ఉన్న||

5. నీ వాగ్దత్తము నమ్మి నీపై భారము పెట్టి జీవ మార్గముఁ గంటిని
కేవలంబగు ప్రేమ చేతను నీవు నన్ను క్షమించి చేకొని భావశుద్ధి నొనర్చి
సంతోషావసరముల నిడుదువని యిదె ||ఉన్న||

6. దరిలేని యానంద కరమైన నీ ప్రేమ తరమే వర్ణన చేయను
తెరవు కడ్డం బైన యన్నిటి విఱుగఁగొట్టెను గాన నే నిపు డరుదుగా నీ
వాఁడ నవుటకు మఱి నీవాఁడ నవుటకే ||ఉన్న||

Your favourites

  • No Favourites found!