Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా Telugu Christian Song Lyrics

ఉన్నపాటున వచ్చు చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా Lyrics

ఉన్నపాటున వచ్చు-చున్నాను నీ పాద సన్నిధి-కో రక్షకా

ఎన్న శక్యము గాని పాపము-లన్ని మోపుగ వీపు పైబడి

యున్న విదె నడలేక తొట్రిలు-చున్నవాడను నన్ను దయగను     ||ఉన్న||

కారుణ్య నిధి యేసు – నా రక్షకా నీ శ-రీర రక్తము చిందుట

భూరి దయతో నన్ను నీ దరి – జేర రమ్మని పిలుచుటయు ని

ష్కారణపు నీ ప్రేమ యిది మరి – వేరే హేతువు లేదు నా యెడ      ||ఉన్న||

మసి బొగ్గు వలె నా మా-నస మెల్ల గప్పె దో-ష సమూహములు మచ్చలై

అసిత మగు ప్రతి డాగు తుడువను – గసుటు గడిగి పవిత్ర పరపను

అసువు లిడు నీ రక్తమే యని – మాసల కిప్పుడు సిలువ నిదె గని     ||ఉన్న||

వెలుపట బహు యుద్ధ-ములు లోపటను భయము – కలిగె నెమ్మది దొలాగెను

పలు విధములగు సందియంబుల – వలన పోరాటములచే నే

నలసి యిటునటు గొట్టబడి దు-ర్బలుడనై గాయములతో నిదె      ||ఉన్న||

కడు బీద వాడ నం-ధుడను దౌర్భాగ్యుడను చెడిపోయి పడియున్నాను

సుడివడిన నా మదికి స్వస్థత – చెడిన కనులకు దృష్టి భాగ్యము

బడయ వలసిన వన్ని నీ చే – బడయుటకు నా యొడ యడా యిదె      ||ఉన్న||

నీ వాగ్దత్తము నమ్మి – నీపై భారము పెట్టి – జీవ మార్గము గంటిని

కేవలంబగు ప్రేమ చేతను – నీవు నన్ను క్షమించి చేకొని

భావ శుద్ధి నొనర్చి సంతో-షావసరముల నిడుదువని యిదె    ||ఉన్న||

దరిలేని యానంద-కరమైన నీ ప్రేమ – తరమే వర్ణన చేయను

తెరవు కడ్డం బైన యన్నిటి – విరుగ గొట్టెను గాన నే నిపు

డరుదుగా నీ వాడ నవుటకు – మరి నిజము నీ వాడ నవుటకే     ||ఉన్న||

Your favourites

  • No Favourites found!