ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు
ఎన్నతగిన మహారక్షణ శిఖరము
సుందర మొందు సదా (2)
1. మరణము మ్రింగబడె - ఘన విజయము ప్రాప్తమాయె
మరణపు ముల్లును విరచి జయంబును
యేసు అనుగ్రహించెన్ (2)
2. ఎవరు మనస్సు ప్రభుపై - నిశ్చలముగ నిల్పెదరో
దైవ శాంతి నొంది క్రీస్తుతో నిలిచి
సంతస మొందెదరు (2)
3. ఆశ్చర్యకరుడాయనే - ఆలోచన కర్తయును
నిశ్చయముగా బహు బుద్ధివివేకము
లిచ్చి నడుపు సదా (2)
4. చంచల హృదయులును - ముష్కరులగు పాపులును
వంచనలేక వాక్యమునకు
తలవంచి విధేయులౌదురు (2)
5. కుడికి తిరిగినను - మరి యెడమకు తిరిగినను
నడువుడి త్రోవయిదే యను శబ్దము
చెవులకు వినబడును (2)
6. పక్షిరాజు తనదు - పిల్లల కాచెడు రీతి
రక్షణ కర్త యెహోవా నిన్ను
కాచి రక్షించు సదా (2)
7. సుందరమగు రాజున్ - నీ కనులతో చూచెదవు
అందమైన యా పరలోక రాజ్యము
ప్రబలుట చూచెదవు (2)
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
ఉన్నత స్థలములపై నెక్కించి చూపించు ప్రభు Lyrics
Your favourites
- No Favourites found!
