Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యాఆ మహిమను విడిచావా Telugu Christian Song Lyrics

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యాఆ మహిమను విడిచావా Lyrics

ఉన్నతమైన రాజ్యపువాసీ యేసయ్యా
ఆ మహిమను విడిచావా
ఎన్నికలేని పాపిని నాకై యేసయ్యా
ఈ ధరణికి వచ్చావా
నీ జన్మ మనుజాలిపంట - సాతనుకే చితిమంట
నా జీవితమంతా నీ ప్రేమగీతి పాడుకుంటా
1. మంచివారినే ప్రేమించుట మాకిలలో సాధ్యము కాదే
మంచికార్యములు చేయు స్వభావము మాలోపల కానరాదే
మంచితనమన్నదే లేని వంచకుని కరుణించావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా
2. ప్రాణప్రదముగా ప్రేమించిన తన మిత్రుని కొరకైనా
ప్రాణము నిచ్చెడు వారిని ఇలలో ఎచటా కనుగొనలేమే
గుణహీనుడైన మానవుని ఋణము చెల్లింపదలిచావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా
3. పొరుగువాడు కలిగున్నదానినే ఆశించుటయే తప్ప
ఇరుగుపొరుగులకు అక్కరలో సహాయము చేయగలేమే
పురుగువంటి నరమాత్రునికి కరుణతో సర్వమిచ్చావా
మహిమను విడిచావా - ధరణికి వచ్చావా

Your favourites

  • No Favourites found!