Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఉన్నతమైన స్థలములలో  ఉన్నతుడా మా దేవా Telugu Christian Song Lyrics

ఉన్నతమైన స్థలములలో ఉన్నతుడా మా దేవా Lyrics

పల్లవి:   ఉన్నతమైన స్థలములలో  - ఉన్నతుడా మా దేవా

ఉన్నతమైన నీ మార్గములు మాకు తెలుపుము దేవా    || ఉన్నత ||


1.     చెదరి పోయినది మా దర్శనము - మందగించినది ఆత్మలభారం

మరచిపోతిమి నీ తొలిపిలుపు - నీ స్వరముతో మము మేలుకొలుపు

నీ ముఖకాంతిని ప్రసరింపచేసి - నూతన దర్శన మీయుము దేవా

నీ సన్నిధిలో సాగిలపడగా - ఆత్మతో మము నిలుపుము దేవా   || ఉన్నత ||


2.     పరిశోధించుము మా హృదయములను - తెలిసికొనుము మా తలంపులను

ఆయాసకరమైన మార్గము మాలో - వున్నదేమో పరికించు చూడు

జీవపు ఊటలు మాలోన నింపి - సేదదీర్చి బ్రతికించు మమ్ము

మా అడుగులను నీ బండపైన - స్థిరపరచి బలపరచుము దేవా   || ఉన్నత ||


3.     మా జీవితములు నీ సన్నిధిలో - పానార్పణముగా ప్రోక్షించెదము

సజీవయాగ శరీరములతో - రూపాంతర నూతన మనసులతో

నీ ఆత్మకు లోబడి వెళ్ళెదము - నీ కృపచేత బలపడియెదము

లోకమున నీ వార్తను మేము - భారము తోడ ప్రకటించెదము   || ఉన్నత ||

Your favourites

  • No Favourites found!