వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక
వారాయనను పెద్దల సమాజములో కీర్తింతురు గాక
1. దేశనివాసుల చెడుగును బట్టి - నదుల నడవిగ జేసెను
నీటి బుగ్గల నెండిన నేలగాను మార్చెను
2. అడవిని నీటిమడుగుగా - మార్చివేసె నెహోవా
ఎండిన నేలను నీటి - ఊటగాను మార్చెను
3. పురములు నివాసమునకై - వారేర్పరచుకొనునట్లు
పొలములలో విత్తనములు చల్లి - ద్రాక్షాతోటలు నాటిరి
4. సస్య ఫల సమృద్ధి పొందు - నట్లు వాటివలన
ఆయన ఆకలిగొనిన వారిని - అచ్చట కాపురముంచెను
5. మరియు ఆయన వాని నధికము - గా నాశీర్వదించగా
వారి సంతానాభివృద్ధి - అధికముగా వర్ధిల్లెను
6. వారు విచార బాధ వలన - తగ్గిపోయినపుడు
రాజులను తృణీకరించి - ఎడారిలో తిరుగజేసె
7. అట్టి దరిద్రుల బాధను బాపి - వారిని లేవనెత్తెను
అట్టివారి వంశము మంద - వలె వృద్ధిచేసెను
8. యధార్థవంతులు దాని - చూచి సంతోషింతురు
మోసము చేయువారందరు - మౌనముగా నుందురు
9. బుద్ధిమంతులు యీ విషయ-ముల నాలోచించును
యెహోవ కృపాతిశయముల - దలంచెదరు గాక
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
వారాయనను జనసమాజములో ఘనపరచుదురు గాక వారాయనను Lyrics
Your favourites
- No Favourites found!
