Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెనుహెచ్చైన Telugu Christian Song Lyrics

వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెనుహెచ్చైన Lyrics

వచ్చిగాబ్రియేలు పల్కెను మరియ మచ్చకంటిడెంద ముల్కెను
హెచ్చైన శుభముల నెనలేని కృప దేవుఁ డిచ్చి యింతులలోని న్నెచ్చు
జేయునటంచు ||వచ్చి||

1. భయ మాత్మలో వీడు కన్యకా నీవు దయబొంది యున్నవు ధన్యగా
రయముగ నిదిగోగ ర్భముఁ దాల్చెదవు పుత్రో దయమౌ యేసను పేర
తని కిడు మంచును ||వచ్చి||

2. అతఁడెన్నఁబడును మహాత్ముడై సర్వో న్నతుఁడైన దైవకుమారుఁడై
హిత మొప్పు దేవుండు న్నతిఁ జేసి దావీదు వితత సింహాసన మతని
కిచ్చునంచు ||వచ్చి||

3. ఘనతరుఁడగు వాని రాజ్యము అంత మొనగూడ దది నిత్యపూజ్యము
వనితమగు యాకోబు వంశ మెల్లపు డేలు కొను నాతఁ డనుంచుఁ
దె ల్పెను దూత మరియతో ||వచ్చి||

Your favourites

  • No Favourites found!