Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది Telugu Christian Song Lyrics

వచ్చింది వచ్చింది మధురమైన సమయం తెచ్చింది Lyrics

వచ్చింది వచ్చింది మధురమైన సమయం
తెచ్చింది నూతన కాంతుల ఉదయం
రావయ్యా వరుడా (రావమ్మా వదువా) సుస్వాగతం
నీకోసమే ఈ స్వాగత గీతం
1.మల్లెలు పరిమళం చల్లినవేళ
అల్లరి తెమ్మెర తాకినవేళ /2/
వెల్లువై ఆనందం పొంగిన వేళ
మెల్లగ నీ పాటి దరిచేరగా /2/రా/
2.కోయిల గానాలు వినిపించువేళ
కోరిన ఘడియలు ఎదురైనవేళ /2/
చామంతులే పలకరించినవేళ
చేయందుకొని సతిని స్వీకరించగా /2/రా/
3.పరలోక వాకిళ్లు తెరచుకొన్నవేళ
పరమాశీర్వాదాలే కురియుచున్నవేళ /2/
మనసైన నీ వరుడు ఎదురు చూచువేళ
వినయముగా నీ ప్రియుని సంధించగా /2/రా/

Your favourites

  • No Favourites found!