Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ Telugu Christian Song Lyrics

వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ Lyrics

వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు
తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో ||వద్దు||

1. చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు
మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక ||వద్దు||

2. నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ
యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో ||వద్దు||

3. ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి
కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక ||వద్దు||

4. బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు
యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక ||వద్దు||

5. పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను
కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక ||వద్దు||

6. మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు
ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక ||వద్దు||

Your favourites

  • No Favourites found!