Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము Telugu Christian Song Lyrics

వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును విశ్వాసము Lyrics

వాగ్దానములు పొందుడి మీలో ప్రతివాడును
విశ్వాసము చేతను ఓర్పుతోడ నెప్పుడు
1. ఇదివరకు మీరెవ్వరైనను - క్రీస్తు పేరట అడుగలేదుగదా
మదినెంతో నిండు సంతోషముపొంది - అడుగుడి దొరుకు మీకు
2. తన మహిమ ఐశ్వర్యము చొప్పున - నివ్వ క్రీస్తు యేసు కోరియుండ
మీ నేత్రములు పరమువైపు త్రిప్పి - అడుగుడి దొరుకు మీకు
3. దేవుని మందిర నిధిలోనికి - దశమ భాగములెల్ల తెండు
దీవెనలు క్రుమ్మరించు నిక్కముగ - శోధించుడి దేవుని
4. ఆయురారోగ్య శక్తిసంపదల్ దేవుని ఉచిత కృపయేగదా
ఆయనకు అర్పణం నర్పించి - శోధించుడి దేవుని
5. యెహోవా నాశ్రయించు వారికి - ఎట్టిమేలు కొదువై యుండదు
యెహోవా ఉత్తముడని నమ్ముడి - రుచించి గుర్తించుడి
6. దీనుడైన నీవు మొరపెట్టగా - శ్రమలలోనుండి రక్షించెదనిన్ను
తన నామమందు నమ్మిక యుంచి - రుచించి గుర్తించుడి
7. పాటించుము దేవుని ఆజ్ఞలన్ నీ క్షేమము గొప్ప నదివలెను
నేటినుండి సముద్రపుటలలను - పోలి నీ నీతియుండు


Your favourites

  • No Favourites found!