Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు Telugu Christian Song Lyrics

వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు నాలో నెరవేర్చుచున్నాడు Lyrics


వాగ్ధానములన్ని నెరవేర్చుచున్నాడు
నాలో నెరవేర్చుచున్నాడు (4)
నేను జడియను భయపడను అలసిపోను
వాగ్దానముల్ నా సొంతమేగా (4)

కన్నీటిని తుడచువాడవు
కదలకుండ నన్ను నిలబెట్టువాడవు (2)
ప్రతి వాగ్ధానమును నెరవేర్చువాడవు (2)
నా నీతివలన కానీ కాదయ్యా
అంతా నీ నీతి వలనేనయ్యా (2)      ||నేను జడియను||

కృంగిపోక నే సాగిపోదును
నీ కృప నా తోడున్నదిగా (2)
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
విస్తారమైన కృప ఉండగా
నే అలయక సాగెదనయ్యా (2)

నే అలయక సాగెదనయ్యా…
అది ఇరుకైననూ విశాలమైననూ (2)
నా యేసయ్య తోడుండగా
నే అలయక సాగెదనుగా (2)      ||నేను జడియను||

Your favourites

  • No Favourites found!