Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వందనము నీకే నా వందనము Telugu Christian Song Lyrics

వందనము నీకే నా వందనము Lyrics


వందనము నీకే నా వందనము (2)
వర్ణనకందని నీకే నా వందనము (2)      ||వందనము||

నీ ప్రేమ నేనేల మరతు
నీ ప్రేమ వర్ణింతునా (2)
దాని లోతు ఎత్తునే గ్రహించి (2)
నీ ప్రాణ త్యాగమునే తలంచి (2)      ||వందనము||

సర్వ కృపానిధి నీవే
సర్వాధిపతియును నీవే (2)
సంఘానికి శిరస్సు నీవే (2)
నా సంగీత సాహిత్యము నీవే (2)      ||వందనము||

పరిశుద్ధమైన నీ నామం
పరిమళ తైలము వలె (2)
పరము నుండి పోయబడి (2)
పరవశించి నేను పాడెదను (2)      ||వందనము||

మృతి వచ్చెనే ఒకని నుండి
కృప వచ్చెనే నీలో నుండి (2)
కృషి లేక నీ కృప రక్షించెను (2)
కృతజ్ఞతార్పణలర్పింతును (2)      ||వందనము||

తండ్రియైన దేవునికే
కుమారుడైన దేవునికే (2)
పరిశుద్ధాత్మ దేవునికే (2)
వందన వందన వందనము (2)      ||వందనము||

Your favourites

  • No Favourites found!