Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా Telugu Christian Song Lyrics

వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా Lyrics

వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం
వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె ||వందనం||

1. సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ
నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా
మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద
నందముగ మహిమ ప్రభువా ||వందనం||

2. భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి
నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు
భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము
||వందనం||

3. మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ
గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా
నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి
పోయెను మరణ బలమున ||వందనం||

4. సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా
ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక
పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా
యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||

5. నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల
నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ
జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే
||వందనం||

6. మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో
వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా
దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా
తరుణమునఁ జూపుము యెహోవా ||వందనం||

Your favourites

  • No Favourites found!